ADB: ఉచిత గాలి కుంటు వ్యాధి నివారణ టీకాలు తప్పనిసరిగా వేయించాలని జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ రామారావు అన్నారు. శనివారం ఇంద్రవెల్లి మండలంలోని మర్కగూడ గ్రామంలో పశువులకు గాలికుంటు నివారణ టికాలు వేశారు. అదేవిధంగా పశువులకు ఆధార్ నెంబర్ తో కూడిన ట్యాగ్స్ వేశారు. వ్యాధి నివారణ పై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో పశువైద్యాధికారి సుభాష్, సిబ్బంది ఉన్నారు.