ELR: రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు శనివారం జంగారెడ్డిగూడెం పట్టణానికి విచ్చేశారు. స్థానిక కూటమి నాయకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. వేలేరుపాడులోని పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు మంజూరైన పరిహారం నిధులను పంపిణీ చేయనున్న కార్యక్రమానికి అక్కడ నుంచి నాయకులతో కలిసి ఆయన తరలి వెళ్లారు.