భారత్-A, దక్షిణాఫ్రికా-A మధ్య జరుగుతున్న తొలి అనాధికార టెస్టులో మూడో రోజు ఆట ముగిసింది. 275 పరుగుల లక్ష్య చేధనలో ఆట ముగిసే సమయానికి భారత్-A నాలుగు వికెట్ల నష్టానికి 119 పరుగులు చేసింది. కెప్టెన్ రిషభ్ పంత్ (64*) హాఫ్ సెంచరీ చేశాడు. ఇంకా ఒక్క రోజు ఆట మిగిలి ఉన్న ఈ మ్యాచ్లో భారత్-A విజయానికి 156 పరుగులు చేయాల్సి ఉంది.