ASF: దహెగాం మండలం గేర్రె గ్రామంలో కుల దురహంకార హత్యపై శ్రావణి కుటుంబానికి న్యాయం చేయాలని మంగళవారం ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జిల్లా ఎస్పీ కాంతిలాల్ పాటిల్‌కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్బంగా నాయకులు మాట్లాడుతూ.. శ్రావణి అత్త, మామ వారి కుటుంబ సభ్యులు అందరిని నిందితులుగా చేర్చాలన్నారు. శ్రావణి కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తానని SP పేర్కొన్నారు.