KRNL: ఎల్ఎల్సీ ద్వారా రెండో పంటకు మార్చి ఆఖరి వరకు సాగునీరు అందించాలని డీసీ ఛైర్మన్ నరవ రమాకాంతరెడ్డి డిమాండ్ చేశారు. ఇవాళ ఆదోనిలో జరిగిన తుంగభద్ర ప్రాజెక్టు కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అధిక వర్షాల కారణంగా ఖరీఫ్ పంటలు దెబ్బతినడంతో.. రైతులను ఆదుకోవడానికి నీటి విడుదల తప్పనిసరన్నారు. గేట్ల మరమ్మతుల పేరుతో సాగునీటిని నిలిపివేస్తామనడం సరికాదన్నారు.