కోనసీమ: పరిశ్రమల స్థాపనపై యువత, మహిళలు దృష్టి సారించాలి, ప్రభుత్వం అందిస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని డీఆర్డీఏ పీడీ సాయినాధ్ జయచంద్ర సూచించారు. మంగళవారం కొత్తపేట బుల్లి సత్యం కాపు కళ్యాణమండపంలో ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగిన ఎంఎస్ఎంఈ అవగాహనా సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. పారిశ్రామిక చైతన్యం పెంపొందించడం ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.