అనకాపల్లి: కోటవురట్ల మండలంలో పలు ఆలయాలను ఎంపీడీవో చంద్రశేఖర్ బుధవారం ఉదయం సందర్శించారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా చేసిన ఏర్పాట్లను ఎంపీడీవో పరిశీలించారు. ఎండపల్లి, కోటవురట్లలో శివాలయాలు, లింగాపురంలో అయ్యప్ప దుర్గ మల్లేశ్వర స్వామి దేవాలయాలకు వెళ్లినట్లు తెలిపారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూడాలని నిర్వాహకులను ఆదేశించామన్నారు.