బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ చిక్కుల్లో పడ్డాడు. పాన్ మసాలా ప్రకటనలకు సంబంధించి ఆయనకు లీగల్ నోటీసులు జారీ అయ్యాయి. ‘రాజ్శ్రీ పాన్ మసాలా’ ప్రకటనలు ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నాయని ఆరోపిస్తూ కోటా వినియోగదారుల కోర్టులో BJP నాయకుడు ఇందర్ మోహన్ సింగ్ హానీ పిటిషన్ దాఖలు చేశారు. కోర్టు సల్మాన్‌కు ఈ నెల 27న విచారణకు రావాలంటూ నోటీసులు జారీ చేసింది.