W.G: భీమవరం బలుసుమూడిలోని శ్రీమావుళ్ళమ్మ అమ్మవారికి బుధవారం వెండితో త్రిశూలంతో కూడిన హస్తాన్ని అందించారు. మాజీ కౌన్సిలర్ పెన్మెత్స శ్రీలక్ష్మి, శ్రీధర్ దంపతులు సుమారు రూ. 55 వేల విలువైన ఈ హస్తాన్ని రాజ్యసభ మాజీ సభ్యురాలు తోట సీతారామలక్ష్మి చేతుల మీదుగా దేవస్థానానికి అందజేశారు. ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారికి అలంకరణ చేశారు.