వరంగల్ జిల్లాలో 9వ, 10వ తరగతి చదువుతున్న ఎస్సీ విద్యార్థులకు షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ తరఫున రూ.3,500 స్కాలర్షిప్ మంజూరు చేయనున్నట్లు విద్యా శాఖ అధికారి భాగ్యలక్ష్మి ప్రకటించారు. ఇవాళ ఆమె మాట్లాడుతూ.. జిల్లా పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల ప్రిన్సిపాళ్లు విద్యార్థుల వివరాలను https://telanganaepass.cgg.gov.in వెబ్సైట్లో నమోదు చేయాలని ఆదేశించారు.