ADB: బేల పోలీస్ స్టేషన్ను జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్లోని రికార్డులను పరిశీలించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలలో పోలీసు వ్యవస్థపై ఉన్న గౌరవం పెంచేలా విధుల నిర్వహణ చేపట్టాలన్నారు. సరిహద్దులో అసాంఘిక కార్యకలాపాలను పూర్తిగా రూపుమాపాలని సూచించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వర్తించాలన్నారు.