GNTR: లామ్ ఆచార్య ఎన్.జీ రంగా విశ్వవిద్యాలయ ప్రాంగణంలో ఈ నెల 7వ తేదీన సీఎం చంద్రబాబు పర్యటన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా ఇవాళ పరిశీలించారు. ఈ మేరకు వేదికను జిల్లా కలెక్టర్ సందర్శించారు. అదేవిధంగా ఈ నెల 9వ తేదీన పెదకాకాని మండలం కాకాని నగర్లో శంకర నేత్రాలయ ఆసుపత్రిలో సీఎం పర్యటన ఏర్పాట్లను కూడా పరిశీలించారు.