W.G: సర్వ శిక్ష కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని, కూటమి ఇచ్చిన హామీలను అమలు చేయాలని సర్వ శిక్ష అభియాన్ ఉద్యోగుల జేఏసీ జిల్లా కార్యదర్శి జనార్దన్ డిమాండ్ చేశారు. భీమవరం యూటీఎఫ్ కార్యాలయంలో బుధవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వేతనాలు పెంచాలని కోరుతూ ఈనెల 10న కలెక్టర్ కార్యాలయాల ముందు ధర్నా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.