SKLM: ఈనెల 11న జాతీయ విద్య దినోత్సవ వేడుకలను జిల్లా కలెక్టర్ సమావేశ మందిరంలో నిర్వహించనున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. దేశ తొలి విద్యాశాఖ మంత్రి, భారత రత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ 138వ జయంతిని పురస్కరించుకుని జరపనున్న కార్యక్రమంలో అధికారులు పాల్గొనాలని కలెక్టర్ అన్నారు.