అన్నమయ్య: లక్కిరెడ్డిపల్లి మండలం జాండ్రపల్లి ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న సి. గౌతమి, శనివారం కడప మున్సిపల్ గ్రౌండ్లో జరిగిన జిల్లా స్థాయి క్రికెట్ సెలక్షన్ పోటీలలో అద్భుత ప్రతిభ కనబరచి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైంది. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు సిద్దేశ్వరయ్య, వ్యాయామ ఉపాధ్యాయుడు చక్రపాణి గౌతమిని అభినందించారు.