సత్యసాయి: పెనుకొండ ప్రభుత్వ జూనియర్ కళాశాల ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు కొండపల్లిలో 6వ రోజు ఆదివారం స్పెషల్ క్యాంపు నిర్వహించారు. ఈ సందర్భంగా కొండమీద ఉన్న వెంకటేష్ స్వామి గుడి దగ్గర 150 మొక్కలు ఎన్ఎస్ఎస్ విద్యార్థులు నాటారు. పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో వాలంటీర్లు, పీఓడీ శివన్న, ఉమా శంకర్,తదితరులు పాల్గొన్నారు.