W.G: జిల్లాలో గడచిన 24 గంటల్లో 112.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు బుధవారం వెల్లడించారు. పోడూరులో అత్యధికంగా 56.2 మీమీ వర్షపాతం రికార్డయింది. పాలకోడేరులో 35 మీమీ, పెనుమంట్రలో 22.4 మీమీ, తణుకులో 22.8 మీమీ, పాలకొల్లులో 19.2 మీమీ, నరసాపురంలో 18.8 మీమీ చొప్పున వర్షపాతం నమోదైందని అధికారులు ప్రకటించారు.