అనకాపల్లి: విద్యుత్ శాఖ సర్కిల్ పర్యవేక్షక ఇంజనీర్ కార్యాలయ భవన నిర్మాణానికి మంత్రి గొట్టిపాటి రవికుమార్ బుధవారం శంకుస్థాపన చేశారు. దీనిని రూ.5.5 కోట్లతో నిర్మిస్తున్నట్లు తెలిపారు. భవన నిర్మాణ పనులను సకాలంలో పూర్తి చేయాలని సూచించారు. నాణ్యత లోపించకుండా చూడాలన్నారు. ఎంపీ సీఎం రమేష్, ఎమ్మెల్యేలు కొణతాల రామకృష్ణ పాల్గొన్నారు.