కడప జిల్లా బీజేపీ నాయకులు బీరం సుబ్బారెడ్డి బుధవారం కాజీపేట మండలంలో మండల కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మండలంలో బీజేపీ పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాజీపేట మండల ప్రెసిడెంట్ శ్రీకాంత్ రెడ్డి, మండల కమిటీ సభ్యులు, కార్యకర్తలు పాల్గొన్నారు.