MDK: కొల్చారం మండల పరిధిలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతు రక్షణ సమితి సభ్యులు బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆ సంఘ జిల్లా అధ్యక్షులు అంతం గారి వెంకటేష్ మాట్లాడుతూ.. రైతులకు ఇబ్బంది కలగకుండా ధాన్యం కొనుగోలు వేగవంతంగా పూర్తి చేయాలని ప్రభుత్వానికి సూచించారు. అనంతరం రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కొనుగోలు ప్రారంభం కాకపోవడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు.