SRD: తెలంగాణలో వికలాంగుల ప్రత్యేక శాఖను ఏర్పరచాలని కంగ్టి మండల వికలాంగుల సంఘం అధ్యక్షుడు భూరే లక్ష్మణ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం కంగ్టిలో మాట్లాడుతూ.. గత 2022 డిసెంబర్ 2న అప్పటి ప్రభుత్వం వికలాంగులకు ప్రత్యేక శాఖకు జీవో 34 జారీ చేసింది. కానీ ఇప్పటివరకు అమలు కాలేదన్నారు. ప్రభుత్వం స్పందించి, దీన్ని వెంటనే అమలు చేయాలని కోరారు.