ATP: పుట్లూరు మోడల్ స్కూల్‌కు చెందిన బస్సు చింతకుంట సమీపంలో అదుపుతప్పి రోడ్డు దిగువకు దూసుకుపోయింది. బస్సు రోడ్డు పక్కకు వాలినప్పటికీ, తృటిలో పెను ప్రమాదం తప్పింది. బస్సులో ఉన్న విద్యార్థులకు, డ్రైవర్‌కు ఎవరికీ ఎటువంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనకు కారణమైన డ్రైవర్‌పై అధికారులు విచారణ చేపట్టనున్నారు.