SRD: ఝరాసంగం మండల కేంద్రంలోని శ్రీకేతకి ఆలయం ప్రాంగణంలోని మండపంలో బుధవారం సంగమేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం కమనీయంగా కొనసాగింది. కార్తీక మాసం, పౌర్ణమి పురస్కరించుకుని అర్చక బృందం వేదమంత్రోచ్ఛారణల మధ్య పార్వతి, సంగమేశ్వర స్వామికి వైభవంగా కళ్యాణం జరిపారు. ఆలయ ఛైర్మన్ చంద్రశేఖర్, కార్యనిర్వాహణ అధికారి శివ రుద్రప్ప నిర్వహణలో ఈ మహోత్సవం చేపట్టారు.