ELR: జంగారెడ్డిగూడెం సబ్ డివిజన్ ప్రాంతానికి మొదటిసారిగా ఏఎస్పీ స్థాయి అధికారిని ప్రభుత్వం నియమించింది. ఈ సందర్భంగా ఏఎస్పీగా బుధవారం సుష్మిత రామనాథన్ బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు ఇక్కడ పని చేసిన డీఎస్పీ రవిచంద్ర వద్ద నుంచి ఆమె బాధ్యతను తీసుకున్నారు. సబ్ డివిజన్ పరిసర ప్రాంతాలలో అసాంఘిక కార్యక్రమాలకు తావులేకుండా సిబ్బంది సహకారంతో కృషి చేస్తానని వివరించారు.