గాలివీడు మండల సాధారణ సర్వసభ్య సమావేశం ఈనెల 10వ తేదీన MPP పద్మావతమ్మ అధ్యక్షతన నిర్వహించనున్నట్లు MPDO చంద్రమౌళీశ్వర్ బుధవారం పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ.. సోమవారం ఉదయం 11 గంటలకు స్థానిక మండల ఎంపీడీవో కార్యాలయ సభా భవనంలో జరగబోయే కార్యక్రమానికి ప్రజాప్రతినిధులు, మండల అధికారులు హాజరు కావాలన్నారు. వివిధ శాఖల అధికారులు నివేదికలు సమర్పించాల్సి ఉంటుందని తెలియజేశారు.