TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. యూసఫ్ గూడ డివిజన్ వెంకటగిరిలో కిషన్ రెడ్డి పాదయాత్ర చేశారు. బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి తరపున కిషన్ రెడ్డి ఓట్లు అభ్యర్థిస్తున్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ ఏం చేస్తాయో చెప్పకుండా ఓట్లు అడుగుతూ.. ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని మండిపడ్డారు.