కృష్ణా: మోపిదేవిలోని శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని డిస్ట్రిక్ట్ 6వ అడిషనల్ జడ్జి పాండురంగారెడ్డి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ మర్యాదలతో ఆలయ డిప్యూటీ కమిషనర్, ఆలయ కార్యనిర్వాహణ అధికారి దాసరి శ్రీరామ వరప్రసాదరావు ఘనంగా సత్కరించి, ప్రసాదాలను అందజేసి, శ్రీ స్వామివారి చిత్రపటాన్ని బహుకరించారు.