TG: హైదరాబాద్లో కాల్పుల ఘటన కలకలం రేపింది. రాయదుర్గంలో భూ వివాదంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఏపీలోని కర్నూలుకు చెందిన కృష్ణ అనే వ్యక్తి గాలిలోకి కాల్పులు జరిపాడు. ఘటనపై మరోవర్గం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.