పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. అయితే ఆయన సినిమాల లిస్టులో దర్శకుడు ప్రశాంత్ వర్మతో ఓ ప్రాజెక్టు చేయనున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో యంగ్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. కాగా, దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఈ సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉన్నట్లు సమాచారం.