SKLM: చిన్నారులకు క్రమం తప్పకుండా ఇస్తున్న వ్యాక్సిన్‌పై నిర్లక్ష్యం తగదని DMHO డాక్టర్ మేరీ కేథరిన్ అన్నారు. సంతబొమ్మాళి మండలం, నౌపడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంగళవారం సందర్శించారు. అక్కడున్న పీహెచ్సీ సిబ్బంది, ఆశావర్కర్లు, ఏఎన్ఎంలతో సమావేశంలో నిర్వహించారు. క్రమం తప్పకుండా చిన్నారులకు వ్యాక్సిన్ వేయాలని సూచించారు. నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.