E.G: గోకవరం మండలస్థాయిలో UTF, JVV ఆధ్వర్యంలో నిర్వహించిన చెకుముకి టాలెంట్ టెస్ట్‌లో అచ్యుతాపురం జడ్పీ హైస్కూల్ విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. హైస్కూల్ విభాగంలో అచ్యుతాపురం విద్యార్థులు మండలస్థాయిలో ద్వితీయ స్థానం సాధించారు. ఈ సందర్భంగా విద్యాశాఖ అధికారులు, ఎల్ఐసి బ్రాంచ్ మేనేజర్, యుటిఎఫ్ మండల శాఖ అధ్యక్షులు చేతుల మీదుగా బహుమతులు అందుకున్నారు.