BHPL: జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం కలెక్టర్ రాహుల్ శర్మ ఆధ్వర్యంలో గ్రామ, మండల, జిల్లా స్థాయి అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ పథకాల అమలు, పరిపాలన, అభివృద్ధి, ప్రజాసంక్షేమ పథకాల పరిశీలనకు ట్రైనీ ఐఎఎస్ బృందం పర్యటనకు రానున్నట్లు తెలిపారు. శాఖలవారీగా సమగ్ర నివేదికలు తయారు చేయాలని ఆదేశించారు.