SRD: పెండింగ్లో ఉన్న పాత కేసులకు సంబంధించిన అక్రమ మద్యం బాటిళ్లను సిర్గాపూర్ పోలీస్ స్టేషన్లో ధ్వంసం చేసినట్లు ఎస్సై మహేష్ మంగళవారం తెలిపారు. గత కొన్ని నెలల క్రితం స్వాధీనం చేసుకున్న ఈ మద్యం బాటిళ్లను ఎక్సైజ్ శాఖ, పోలీసు సిబ్బంది సమక్షంలో జేసీబీ సహాయంతో గోతిలో వేసి ధ్వంసం చేశారు. కార్యక్రమంలో ఆయా శాఖల సిబ్బంది పాల్గొన్నారు.