TG: ఐదేళ్లు మహిళలకు మంత్రి పదవి ఇవ్వని పార్టీ BRS అని CM రేవంత్ అన్నారు. బల్కంపేట ఎల్లమ్మ దగ్గరికైనా.. భద్రాచలం రాములవారి సన్నిధికైనా వెళ్లడానికి ఉచిత బస్సు ప్రయాణం కల్పించిన ఘనత కాంగ్రెస్ పార్టీది అన్నారు. తాము జూబ్లీహిల్స్లోనే 14,159 రేషన్ కార్డులు ఇచ్చామని వెల్లడించారు. నవీన్ యాదవ్‌ను గెలిపిస్తే 4వేల ఇళ్లు ఇస్తామని సీఎం రేవంత్ హామీ ఇచ్చారు.