నటి వర్ష బొల్లమ్మ నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ‘కానిస్టేబుల్ కనకం’. ఈటీవీ విన్లో స్ట్రీమింగ్ అవుతోన్న ఈ సిరీస్కు విశేష స్పందన వస్తోంది. దీనికి కొనసాగింపుగా సీజన్ 2 వచ్చే నెలలో రాబోతుంది. సీజన్ 1 చివరిలో కనిపించకుండాపోయిన చంద్రిక ఏమైంది? అంటూ వస్తోన్న ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే సీజన్ 2 కోసం వేచి చూడాల్సిందేనని మేకర్స్ తెలిపారు.