TG: భారత సైన్యంలో చేరేందుకు ‘అగ్నివీర్’ ర్యాలీ నిర్వహించనున్నట్లు ఆర్మీ రిక్రూట్మెంట్ బోర్డు తెలిపింది. ఈ నెల 10 నుంచి 22 వరకు హన్మకొండలోని JN స్టేడియంలో నిర్వహించనుంది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోని పదో తరగతి పూర్తి చేసుకున్న అభ్యర్థులు పాల్గొనవచ్చని పేర్కొంది. పూర్తి వివరాలకు 040-27740059, 27740205 నంబర్లను సంప్రదించవచ్చని సూచించింది.