వికారాబాద్ జిల్లా ధారూర్లో మంగళవారం భారీ వర్షం కురిసింది. ఈ నేపథ్యంలో కోట్పల్లి ప్రాజెక్టు అలుగు వద్ద వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. నాగసమందర్ వెళ్లే రహదారిపై వరద నీరు పొంగిపొర్లుతుంది. దీంతో నాగసమందర్, కోటిపల్లి ఇతర గ్రామాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ విషయంపై సంబంధిత అధికారులు స్పందించి వంతెన నిర్మించాలని స్థానికులు కోరుతున్నారు.