GNTR: రెట్రో ఫిట్టేడ్ మోటరైజ్డ్ వాహనాల మంజూరు కోసం ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు దివ్యాంగుల సంక్షేమ శాఖ డీడీ దుర్గాబాయి తెలిపారు. ఈ వాహనాలను వంద శాతం సబ్సిడీతో అందిస్తారన్నారు. దివ్యాంగుల స్వతంత్ర చలనశీలత, ఆత్మ నిర్భరత, సామాజిక భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడమే లక్ష్యం అని ఆమె అన్నారు. ఆసక్తి ఉన్నవారు www.apdascac.ap.gov.inలో దరఖాస్తు చేసుకోవాలన్నారు.