NRPT: జిల్లాలోని అన్ని జిన్నింగ్ మిల్లులు పత్తిని కొనుగోలు చేయాలని జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీను సూచించారు. తెలంగాణ కాటన్ జిన్నింగ్ మిల్లుల సంఘం ఈనెల 6వ తేదీన పత్తి కొనుగోలను నిలిపివేయాలని పిలుపునిచ్చిన నేపథ్యంలో కలెక్టర్ జిన్నింగ్ మిల్లుల యాజమాన్యాలతో సమావేశం అయ్యారు. జిల్లా వ్యవసాయ శాఖ అంచనాల ప్రకారం 12 క్వింటాళ్ల పత్తి వస్తుందన్నారు.