KMM: మధిర ఫ్లైఓవర్ బ్రిడ్జిపై ఈరోజు రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్ పై వెళ్తున్న రిటైర్డ్ ఆర్టీసీ కండక్టర్ నంబూరు రామారావును ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రామారావు తీవ్రంగా గాయపడి రెండు కాళ్లు విరిగినట్లు స్థానికులు తెలిపారు. అప్రమత్తమై అంబులెన్స్‌లో హాస్పిటల్‌కు తరలించినట్లు తెలిపారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.