NDL: పాణ్యం మండలం ఎస్. కొత్తూరు గ్రామంలో జిల్లా ఏఎస్పీ జావలి ఇవాళ పర్యటించారు. కొత్తూరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, నాగలింగేశ్వర స్వామి ఆలయాలలో ఏఎస్పీ జావలి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా జావలి నాగలింగేశ్వర స్వామికి అభిషేకం చేశారు. అనంతరం ఆలయ అర్చకులు ఏఎస్పీ జావలికి తీర్థ ప్రసాదాలను అందజేశారు.