BDK: జిల్లా కేంద్ర గ్రంధాలయాభివృద్ధితో పాటు జిల్లాలో ఉన్న పలు గ్రంధాలయాల అభివృద్ధికి కృషి చేయాలని కోరుతూ గ్రంథాలయ ఛైర్మన్ వీరబాబు మంగళవారం కలెక్టర్‌ను కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. జిల్లా గ్రంధాలయంలో అనేక మౌళిక సదుపాయాల అవసరం ఉందని, అదే విధంగా జిల్లాలో ఉన్న పలు గ్రంథాలయాల అభివృద్ధికి స్థల సేకరణ అవసరం ఉందని అన్నారు.