WGL: గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే (NH 163జీ) పనులకు సంబంధించి భూసేకరణ పురోగతిపై కలెక్టర్ డాక్టర్ సత్య శారద మంగళవారం సమీక్షించారు. మంచిర్యాల – వరంగల్ – ఖమ్మం జిల్లాల మీదుగా నిర్మిస్తున్నఈ ప్రాజెక్ట్ మొత్తం 176.52 హెక్టార్లకు 171.34 హెక్టార్ల భూసేకరణ పూర్తయినట్లు తెలిపారు. మిగిలిన పెండింగ్ అవార్డులను నవంబర్ 10 లోపు పూర్తి చేయాలని ఆదేశించారు.