MNCL: దండేపల్లి మండలంలోని గూడెంగుట్ట సత్యనారాయణ స్వామి దేవాలయానికి వచ్చే భక్తులకు ఇబ్బంది కలగకుండా అన్ని చర్యలు తీసుకోవాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశించారు. కార్తీక పౌర్ణమి నేపథ్యంలో మంగళవారం దేవాలయాన్ని కలెక్టర్ సందర్శించి దేవాలయంలో చేస్తున్న ఏర్పాట్లను ఆలయ ఈవో శ్రీనివాస్ నుండి అడిగి తెలుసుకున్నారు. దేవాలయంలో కలెక్టర్ పూజలు చేశారు.