MBNR: మహబూబ్నగర్ పట్టణంలోని ఇండస్ట్రియల్ ఎస్టేట్ న్యూ ప్రేమ్ నగర్ ప్రాంతంలో మంగళవారం నిర్వహించిన అయ్యప్ప మహా పడిపూజ కార్యక్రమానికి మహబూబ్నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా దేవాలయంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అక్కడ నిర్వహించిన బిక్ష కార్యక్రమం సందర్భంగా అయ్యప్పలకు అన్నం వడ్డించారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.