ASF: సీపీఐ పార్టీ శతజయంతి వేడుకలను విజయవంతం చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కళావేన శంకర్, జిల్లా కార్యదర్శి సాయి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మంగళవారం గోలేటిలోని సీపీఐ కార్యాలయంలో శతజయంతి కరపత్రాలను ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. భారతదేశానికి సంపూర్ణ స్వాతంత్య్రం కావాలని పోరాడిన పార్టీ సీపీఐ అని అన్నారు.