SRPT: ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన పెంచుకోవాలని అప్పుడే భవిష్యత్లో ప్రమాదాలు తగ్గడానికి ఆస్కారం ఉంటుందని ఎస్పీ నరసింహ సూచించారు. మంగళవారం తిరుమలగిరిలోని మెయిన్ రోడ్డుపై ట్రాఫిక్ నియంత్రణపై అవగాహన కల్పించి మాట్లాడారు. వేగంగా వాహనాలు నడపడం, ట్రాఫిక్ నియమాలు పాటించకుండా అడ్డదారిలో ప్రయాణించడం వల్ల ప్రమాదాలు జరుగుతాయన్నారు.