NZB: ప్రభుత్వ పాఠశాలల నిర్వహణ తీరు మరింతగా మెరుగుపడేలా అంకితభావంతో కృషి చేయాలని NZB కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి ఆదేశించారు. కలెక్టరేట్లో మంగళవారం అన్ని మండలాల ఎంఈవోలతో విద్యాశాఖ పనితీరుపై కలెక్టర్ సమీక్ష జరిపి మాట్లాడారు. ఆహ్లాదకర వాతావరణంలో విద్యార్థులకు నాణ్యతతో కూడిన విద్యను బోధిస్తూ, ఫలితాలు గణనీయంగా మెరుగుపడేలా చూడాలన్నారు.