SRPT: కోదాడ మండలంలోని జేపీగూడెం ఎస్సీ కాలనీ మీదగా ప్రమాదకరంగా 11 కేవీ విద్యుత్ లైన్ వెళ్తుండటంతో కాలనీవాసులు భయాందోళన చెందుతున్నారని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు రెమిడెల రాజు అన్నారు. ఈ సమస్యను పరిష్కరించాలని కోరుతూ ఈరోజు ఆయన కోదాడ సబ్ డివిజన్ విద్యుత్ కార్యాలయంలో అధికారికి వినతిపత్రం అందజేశారు.