అనంతపురం జిల్లాలో నవంబర్ 7 నుంచి 9వ తేదీ వరకు 7వ రాష్ట్రస్థాయి రెవెన్యూ క్రీడా పోటీలు, సాంస్కృతిక సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర రెవెన్యూ సర్వీసెస్ అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు. మంగళవారం అనంతపురంలోని RDT క్రీడా మైదానంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాయలసీమ ప్రాంతంలో మొట్టమొదటిసారిగా ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు పేర్కొన్నారు.